Home  »  TV News  »  Podharillu : ఊహించని ట్విస్ట్ ఇచ్చిన శైలు.. అర్ధాంతరంగా ఆగిపోయిన పెళ్లి!

Updated : Aug 19, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 182లో.. శైలు తనకు తెలియకుండానే పెళ్లి ఏర్పాట్లు చేశారని తెలుసుకుని తండ్రి శేఖరంపై కోప్పడుతుంది. నాన్నా.. ఇదంతా నిజమా.. నన్ను మోసం చేశారా.. నేను కేశవను తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోనని శైలు తెగేసి చెప్తుంది. శేఖరం మాత్రం .. కేశవను చేసుకుంటే నీ జీవితం పాడవుతుందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ శైలు మాత్రం..  కేశవ లేకపోతే నేను చచ్చిపోతానని అంటుంది. చివరికి ఆమె పోలీసులకు ఫోన్ చేయబోతే సురేష్ ఫోన్ లాక్కుంటాడు. పెళ్లి అయ్యే వరకు నీకు ఫోన్ ఇవ్వనని వరాలు, సురేష్ కలిసి శైలును బలవంతంగా పెళ్లి మండపం వైపు తీసుకెళ్తారు. అక్కడ ప్రకాష్‌కి శైలుకు ఇష్టం లేదని, ఆమె కేశవను ప్రేమిస్తోందని తెలిసినా పెళ్లికి సిద్ధపడతాడు. శైలు అతడిని కూడా తీవ్రంగా తిడుతుంది. దీంతో వరాలు కోపంతో శైలును కొడుతుంది. 

 

తాళి కట్టే సమయం రాగానే శైలు తన పెళ్లిని ఆపడానికి ఊహించని మాట చెప్తుంది. ఆగండి.. నేను రెండు నెలల గర్భవతిని. నా కడుపులో ఉన్న బిడ్డ కేశవ రక్తమే. ఇప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే తాళి కట్టు అని శైలు చెప్తుంది. ఈ మాట విని వరాలు, సురేష్, శేఖరం షాక్ అవుతారు. ఇది అబద్ధం చెప్తోంది.. నువ్వు పెళ్లి చేసుకో బాబు అని వరాలు అంటుంది. కానీ ప్రకాష్ మాత్రం శైలు మాటలను సీరియస్‌గా తీసుకుంటాడు. ఇలాంటి విషయంలో ఏ ఆడపిల్లా అబద్ధం చెప్పదు. నాకు అసలు విషయం తెలియకుండా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అమ్మాయిని చేసుకుంటాను కానీ.. తల్లిని ఎలా చేసుకోను అంటూ పెళ్లిని ఆపేస్తాడు. దాంతో శైలు పెళ్లి ఆగిపోతుంది. మరోవైపు రుద్రాంబిక అనుగ్రహంతో పెద్ది, మహా, మాధవ్ లు గుడికి వెళ్తారు. అందరి మనసులో స్థానం సంపాదించుకున్నావ్.. ఇకపై నీకు ప్రతి ఏడాది పండుగే అంటూ ఆశీర్వాదం లభిస్తుంది. 

 

మరోవైపు మహా చేతులకు గాయాలు కావడంతో చక్రి ఆమెకు సహాయం చేస్తూ ఉంటాడు. మహా అతడికి కృతజ్ఞతలు చెప్తుంది. నా చేతులు కాలిపోకుండా వేపాకులు ఇచ్చారు.. నడుస్తుంటే నీళ్లు పోశారు.. ఐస్ క్యూబ్స్ కూడా తెచ్చారు. థాంక్స్ అని మహా అంటుంది. మా కుటుంబానికి ఇంత చేసిన మీకే నేను థాంక్స్ చెప్పాలని చక్రి అంటాడు. ఇది మన కుటుంబం.. పెద్ది నాకు కావాల్సిన వాడు. పెద్ది కోసం నేను ఏమైనా చేస్తానని మహా చెప్తుంది. ఆ తర్వాత ఇంట్లో ఉండి బోర్‌గా ఉందని, ఊర్లోకి వెళ్లొద్దామా అని మహా అడుగుతుంది. చక్రి వెంటనే.. మీరు అడగడం.. నేను కాదనడమా వెళ్దామని అంటాడు. బైక్ లేకపోవడంతో సరదాగా .. బయట గుర్రం ఉందని చెప్పి వెంటనే అది గుర్రం కాదు సైకిల్ అని కామెడీ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.